CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 31 October 2025, 11:16 am Posted by : coalbelt 24 News

Singareni : క్రమశిక్షణతో విధులు నిర్వహించిన జాడి శంకర్

Singareni : కాసిపేట -1 గనిలో హాలార్ ఆపరేటర్ గా జాడి శంకర్ 23 ఏళ్లపాటు క్రమశిక్షణతో విధులు నిర్వహించారని గని మేనేజర్ సతీష్ అభినందించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని సింగరేణి కాసిపేట -1 గనిలో హాలార్ ఆపరేటర్ గా జాడి శంకర్ శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్బంగా శంకర్ ను గని ఉన్నతాధికారులు, అధికారులు, సూపర్ వైజర్లు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ శంకర్ గని అభివృద్ధికి, బొగ్గు ఉత్పత్తికి చేసిన సేవలను కొనియాడారు. కార్మికులతో మమేకమై, విధులు నిర్వహించే శంకర్ ఎందరికో ఆదర్శవంతుడన్నారు. సింగరేణిలో 40 ఏళ్ల పాటు ఆరోగ్యకరమైన విధులు నిర్వహించాడన్నారు. అధికారులతో, తోటి కార్మికులతో, సంఘాలతో మెదులుకోవడంలో తనకు తానే సాటన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం AITUC బ్రాంచి సెక్రెటరీ దాగం మల్లేష్, INTUC కేంద్ర ప్రచార కార్యదర్శి బన్న లక్ష్మన్ దాస్, కార్యవర్గ సభ్యులు మేడ సమ్మయ్య,, పిట్ సెక్రెటరీ కన్నయ్య, రాజన్న, టిబిజికెఎస్ పిట్ సెక్రెటరీ బైరి శంకర్,మాజీ వైస్ ఎంపిపి పుస్కురి విక్రమ్ రావ్, మాజీ సర్పంచ్ ఉత్తురి సత్తయ్య, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాసుదేవ్, రక్షణ అధికారి రవీంద్ర నిఖిల్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, ఇంజనీర్లు రామకృష్ణ, సంక్షేమ అధికారి మీర్జా జిస్ జీషాన్, ఏఐటీయూసీ పిట్,సేఫ్టీ కమిటీ నాయకులు చిప్పరి శ్రీహరి, రవీందర్, లింగన్న,సఫట్ అశోక్,అటికేటి సందీప్,కమలాకర్,అఫ్జలుద్దీన్, రమేష్, భిక్షపతి, పిట్టల శివ,రాజేశం,దినేష్,కారుకురి లక్ష్మన్,అన్ని యూనియన్లు నాయకులు,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});