CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 25 October 2025, 12:32 pm Posted by : coalbelt 24 News

CPM : 28న సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

CPM : బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 28న చెన్నూర్ తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్న్ని చేపట్టినట్టు చెన్నూర్ మండల కార్యదర్శి బొడెంకి చందు శనివారం తెలిపారు. చెన్నూర్ మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో చందు మాట్లాడుతూ బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ ను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇటీవల బంద్ పిలుపులో బీజేపీ కేవలం తన ఉనికిని కాపాడుకోడానికే పాల్గొన్నదని ఆయన ఆరోపించారు. బీసీలపై ప్రేమ ఉంటె బీజేపీ వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా ఆయన కోరారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సమావేశంలో ఆయనతో పాటు ఉమా రాణి,సమ్మక్క,నగేష్, చంద్రన్న,కృష్ణమాచారి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});