CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 23 October 2025, 3:20 pm Posted by : coalbelt 24 News

Singareni : కాసిపేట-1 గనిలో నూతన పని స్థలాలను పరిశీలించిన సేఫ్టీ జి ఎమ్

Singareni : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియా లోని కాసిపేట-1 గనిలో బొగ్గు ఉత్పత్తి చేయడానికి నూతన పని స్థలాలకు మైనింగ్ అధికారుల నుంచి ఇటీవల అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో అనుమతి లభించిన పని స్థలాలను జనరల్ మేనేజర్ (సేఫ్టీ) బెల్లంపల్లి రీజియన్ కె రఘు కుమార్ గురువారం పరిశీలించారు.

గనిలోని 4 సీమ్ 13 డిస్ర్తీక్ట్ లో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా పని స్థలాలు మంజూరు కావడం వలన మెరుగయిన ఉత్పత్తి సాధించడానికి అవకాశం ఉందన్నారు. అధికారులు, సూపెర్వైజర్లు, కార్మికులు, నాయకులు సమిష్టి కృషితో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అదే విదంగా నూతనంగా గనిలో ప్రవేశ పెడుతున్న ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, బ్లాస్టర్‌ల పనితీరును కూడా ఆయన ఈ సందర్బంగ పరిశీలించారు. సింగరేణిలో ప్రతి ఏటా నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశ పెడుతున్నామని, ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఏంటో ఉందన్నారు. ఆయనతో పాటు మందమర్రి ఏరియా రక్షణాధికారి భూశంకరయ్య, మేనేజర్ డి. సతీష్, గని రక్షణాధికారి నిఖిల్ అయ్యర్, సర్వేయర్ ప్రభాకర్, సూపెర్వైజర్లు, కార్మికులు ఉన్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});