BJP : కమలనాథులకు భరోసా ఇవ్వని కమలం నేత

BJP : మంచిర్యాల జిల్లాలో మొట్ట మొదటిసారి కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటన కమలనాథుల్లో ఉత్సహాన్ని నింపింది. కానీ భరోసా మాత్రం ఇవ్వలేదని పలువురు కమలనాథులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల పార్టీ అధ్యక్షుడు మధుకర్ ఆత్మ హత్య కు పాల్పడ్డాడు. అతని కుటుంబ సభ్యలను పరామర్శించిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ ఆత్మ హత్యలు చేసుకునే వారు భారతీయ జనతా పార్టీకి అర్హత కాదు అని మీడియా ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో...