CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 06 October 2025, 1:42 pm Posted by : coalbelt 24 News

Kampelli : మంత్రి పొన్నం ప్రభాకర్ భాష మార్చుకోవాలి

Kampelli : తన తోటి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ దురుసుగా మాట్లాడటాన్ని ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య తీవ్రంగా ఖండించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తను మాట్లాడే భాషను మార్చుకుంటే బాగుంటదని సూచించారు. సోమవారం కాంపెల్లి సమ్మయ్య మంచిర్యాలలో మాట్లాడుతూ…..

నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ, వారి సమస్యల పరిస్కారం కోసం కృషి చేస్తున్న లక్ష్మణ్ ను అకారణంగా దూషించడం సరికాదన్నారు. ఒక దళితుడు మంత్రి కావడాన్ని తట్టుకోలేక పోతున్నాడని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవి వచ్చిన నాటి నుంచి మతితప్పి మాట్లాడుతున్నారని సమ్మయ్య ఈ సందర్బంగా ఆరోపించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

భాద్యత గల హోదాలో ఉండి తోటి మంత్రి పై నోరుపారేసుకోవడం పై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తోటి మంత్రి పై గౌరవం లేకుండా మాట్లాడిన పొన్నం ప్రభాకర్ తన నియోజకవర్గంలోని ప్రజలతోపాటు, పార్టీ నాయకులతో, కార్యకర్తలతో ఎలా మాట్లాడుతున్నాడో వివరించాల్సిన అవసరం లేదన్నారు. భాద్యత గల హోదాలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ తన భాష విధానాన్ని మార్చుకొని, ప్రజలకు సేవ చేస్తే బాగుంటుందన్నారు. వెంటనే మంత్రి లక్ష్మణ్ కు పొన్నం ప్రభాకర్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంపెల్లి సమ్మయ్య ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});