CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 05 October 2025, 2:02 pm Posted by : coalbelt 24 News

CPM : స్థానిక ఎన్నికల బరిలో సీపీఎం

CPM : మంచిర్యాల జిల్లాల్లో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో బరిలో ఉంటారని సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి స్పష్టం చేశారు. ఆదివారం జన్నారం మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎస్కె అబ్దుల్లా అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా సంకె రవి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ……

జిల్లాల్లో జరుగబోయే గ్రామ పంచాయితీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ స్థానాలోని అన్నిస్థానాలకు తమ అభ్యర్థులు పోటీ చేస్తారన్నారు. గ్రామీణ ప్రజల అపరిష్కృత సమస్యల పరిస్కారం కోసం సీపీఎం ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. అర్హులైన వారికి ఇల్లు, రేషన్ కార్డు, ఉపాధి పథకాలు, పోడు భూములకు హక్కు పత్రాలు, రవాణా వ్యవస్థ పై పోరాటాలు చేసి ప్రజలు సాధించి పెట్టడం జరిగిందన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

పేద ప్రజల హక్కులు, కనీస సౌకర్యాలను సాధించి పెట్టిన నేపథ్యంలోనే తమ పార్టీ అభ్యర్థులను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదరిస్తారన్నారు. ప్రజల సమస్యల పరిస్కారం కోసం పోరాటం చేయడంలో తమ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుంటుందన్నారు. అందుకే తమ పార్టీ కి ప్రజల్లో ఆధరణ పెరిగిందన్నారు. డబ్బు, మద్యం , మాంసం పంచి పెట్టె సంస్కృతి తమ పార్టీకి ఎన్నడూ లేదన్నారు. నిజాయితీగా ప్రజల సమస్యల పరిస్కారం కోసం పోరాటాలు చేస్తున్న నేపథ్యంలోనే తమ పార్టీ అభ్యర్థులు కూడా నిజాయితీగా విజయం సాధించడం ఖాయమన్నారు.

ఈ కార్యక్రమంలో కనికరపు అశోక్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, కొండ గొర్ల లింగన్న సిపిఎం మండల కార్యదర్శి, సీనియర్ నాయకులు కే.బుచ్చన్న, మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు పోతు విజయ, ఒడిపెల్లి ప్రమీల, పర్ల కనకయ్య, ఆత్రం రాజు, అత్రం రవికుమార్, గుడ్ల రాజన్న, యశోద, అంబటి లక్ష్మన్, దాసండ్ల రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});