CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 19 September 2025, 1:47 pm Posted by : coalbelt 24 News

Etala Rajendar : యూట్యూబ్ ఛానల్స్ కు గిఫ్ట్ పంపిన ఈటల రాజేందర్

Etala Rajendar : తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈటల రాజేందర్ కూడా ప్రముఖ పాత్ర వహించారు. రెండు దఫాలుగా ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా భాద్యతలు. కీలక నేతగా ఎదిగిన ఈటల ను పార్టీ వెళ్లగొట్టింది. ఆయన మైకు పట్టినా, జనం మధ్యలో మాట్లాడినా, ప్రశాంతంగానే మాట్లాడుతారు. ఎంత కోపం ఏర్పడినా మాట్లాడే పద్దతి నెమ్మదిగానే కొనసాగుతుంది. ఎక్కడ స్వరం పెంచాలో, ఎక్కడ స్వరం తగ్గించాలో ఆయనకు బాగా తెలుసు. కాళేశ్వరం, హైడ్రా విషయాలపై కాస్త గట్టిగానే స్పదించారు.

ఇటీవల ఒక ప్రధానమైన నేతపై తన అసంతృప్తిని ఏవిదంగా చెప్పాలనుకున్నాడో ఆ పద్దతిలో చెప్పేశారు MP ఈటల రాజేందర్. ఈటల చెప్పిన పద్దతి విధానంకు పెద్ద మనుసులు దిగిరాక తప్పలేదు. వాస్తవానికి ఆయన ఎవరి మనసు నొప్పించరు. తన మనసు బాధపెడితే ఎక్కడ మందు పెట్టాలో అక్కడ పెట్టేస్తారు. తనను నమ్ముకొని తన ఇంటికి వచ్చిన వారి ఆకలి చూస్తారు. అవస్థ చూస్తారు. అటువంటి నేతపై గత కొద్దీ రోజుల నుంచి సోషల్ మీడియా, మీడియా, జనంలో ఎప్పుడూ కనబడని పత్రికలు, ప్రధానంగా యూట్యూబ్ ఛానల్ లో రకరకాల వార్తలు వాస్తున్నవి. ఈటల రాజేందర్ బీజేపీ కి రాజీనామా చేస్తున్నాడని, పార్టీ పెడుతున్నాడని, కాంగ్రెస్ నాయకులుతో చర్చలు జరుపుతున్నాడంటూ పూటకో వార్త వస్తోంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ నేపథ్యంలో తన పై వార్తలు ప్రసారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్ వారికి MP ఈటల రాజేందర్ శుక్రవారం పెద్ద గిఫ్ట్ పంపడం విశేషం. నేను పార్టీ మారుతున్నాను అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. పార్టీ మారడం అంటే అంత సులభం కాదు. నేను పార్టీ మారడం, మాటలు మార్చే వ్యక్తిని అసలే కాదు. బిఆర్ఎస్ నుంచి కూడా నేను వెళ్ళలేదు. వాళ్ళే వెళ్లగొట్టారు. బట్ట కాల్చి వేయడం.. బురద చల్లడం సరైన పద్ధతి కాదు. బట్టలు మార్చుకున్నంత సులభం కాదు పార్టీలు మారడం. పార్టీ మారడానికి తీసుకునే నిర్ణయం చాలా బలంగా ఉండాలి. అందుకు బలమైన కారణం కూడా ఉండాలి. తానూ పార్టీ మారుతున్నాను అంటూ చేస్తున్న ప్రచారం మంచి పద్దతి కాదు. పదే, పదే నాకు శీల పరీక్ష చేయడం కూడా మంచి పద్దతి కాదు. నా వ్యక్తిత్వాన్ని ఇబ్బంది పెట్టకండి. భవిష్యత్తులో నాపై జరిగే ప్రచారంపై కూడా మీ విజ్ఞతకే వదిలి పెడు తున్నాను అంటూ ఈటల స్పష్టంగా చెప్పేశారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});