Singareni : 22న సింగరేణిలో TNTUC నిరాహార దీక్ష
Singareni : 2024-2025 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి బొగ్గు గని కార్మికులు సాధించిన లాభాల వాటాను చెల్లించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని TNTUC అధ్యక్షుడు పెద్దపల్లి సత్యనారాయణ ఆరోపించారు. గురువారం ఆయన గోదావరిఖని యూనియన్ కార్యాలయంలో మాట్లాడుతూ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 22న ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతున్నామన్నారు. ఈ దీక్షను రామగుండం రీజియన్ లోని RG -1 ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్నామన్నారు. TNTUC యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ దీక్షకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా పెద్దపల్లి...