CPM : యూరియా సరఫరాలో కేంద్రం విఫలం
CPM : తెలంగాణ రాష్ట్రానికి యూరియా సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ళ అషయ్య ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యుద్దాల నేపథ్యంలోనే యూరియ రావడం లేదని కేంద్ర ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగ వ్యవరించడం, మాట్లాడడం సరికాదన్నారు. తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అడ్డగోలుగా మాట్లాడడం పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాలో రైతాంగానికి యూరియ కావలసినంత సరఫరా కాకపోవడం వలన...