CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 22 August 2025, 2:33 pm Posted by : coalbelt 24 News

Singareni : కార్మిక మంత్రిని కలిసిన ఎస్సీ, ఎస్టీ యూనియన్ నేతలు

Singareni : తెలంగాణ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని అయన కార్యాలయంలో సింగరేణి కాలరీస్ SC ST యూనియన్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రిగా భాద్యతలు చేపట్టిన ఆయనను యూనియన్ నేతలు సన్మానించారు.

ఈ సందర్బంగా సింగరేణిలో ఉన్నటువంటి పలు అపరిష్కృత సమస్యలను మంత్రికి వివరించారు. అపరిష్కృత సమస్యల వలన కార్మికులు పలు ఇబ్బందులు పడుతున్నారని నేతలు వివరించారు. జైపూర్ సింగరేణి థర్మల్ కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ జనరల్ సెక్రెటరీ అంతోటి నాగేశ్వరరావు, ఎస్టీ గిరిజన సంఘం ప్రెసిడెంట్ ధరావత్ పంతులు,  శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ డేగల ప్రవీణ్ కుమార్, STPP వైస్ ప్రెసిడెంట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});