CPM : ఆదివాసీలను పట్టించుకోని ప్రభుత్వాలు
CPM : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనాయని సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకే ఆరోపించారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి జిల్లా లోని తాండూర్ మండలం నర్సాపూర్ గ్రామపంచాయితీ పరిధిలోని సోయం లచ్చు పటేల్ గూడెంను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన గ్రామంలో పర్యటించిన అనంతరం మాట్లాడుతూ...... ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామానికి వెళ్లే దారిలో వేసిన తాత్కాలిక వంతెన కొట్టుకు పోవడంతో గ్రామస్తులు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు....