Singareni : కాంట్రాక్టు కార్మికుల వేతనాలను సవరించాలి
Singareni : సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనం విధానం సవరించి ఐపవర్ విధానంతో చెల్లించాలని ఐఎఫ్ టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ.కృష్ణ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గోదావరిఖని ఐఎఫ్టియు కార్యాలయంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు ఎండి.రాసుద్దిన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఐ.క్రిష్ట మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు ఐ పవర్ వేతనాలు 13 సంవత్సరాలుగా అమలు చేయడంలేదన్నారు. ఈ నేపథ్యంలో కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని అయన...