Politics : తెలంగాణలో రెబల్స్ ప్రకంపనలు

Politics : తెలంగాణ రాజకీయాల్లో బలమైన నేతలు తోటి నేతలపై ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఈ ప్రకంపనలు సృష్టించేవారు పార్టీ గడప దాటి వెళ్ళలేరు. పార్టీ నియమాలకు కట్టుబడి ఉండలేరు. కంటిలోని నలుసు మాదిరిగా పార్టీకి ఇబ్బంది పెడుతుంటారు. మీడియా ఎదుట పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రవర్తించినప్పటికీ పార్టీ పెద్దలు ప్రేక్షక పాత్రను పోషించడం విశేషం. బిజెపి లో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య పచ్చగడ్డి వేస్తె బగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఒకరిని మించి ఒకరు కాలు దువ్వుతున్నారు. ఇద్దరి మాటల యుద్ధం...