TBGKS : కొప్పుల ఈశ్వర్ కు టీబీజీకేఎస్ పగ్గాలు ఎందుకంటే ?

TBGKS : తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. గులాబీ పార్టీకి అనుబందంగా సింగరేణిలో పనిచేస్తోంది. ఉద్యమం నేపథ్యంలోనే సింగరేణిలో సంఘం పురుడు పోసుకుంది. రెండుసార్లు కార్మిక గుర్తింపు సంఘంగా పనిచేసింది. ఓటమిని ముందే పసిగట్టిన సంఘం ఇటీవల జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. సింగరేణి గుర్తింపు హోదాలో సంఘం కొంత మోదం, మరి కొంత ఖేదం మూటగట్టుకుంది. పీకల్లోతు కష్టాల్లోకి కూరుకు పోయిన సంఘాన్ని ఎంత బలోపేతం చేద్దామన్నా కుదిరే పరిస్థితి లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కార్మికులు...