TRASMA : విద్యార్ధి సంఘాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు
TRASMA : మంచిర్యాల జిల్లాలోని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలను అకారణంగా పలు విద్యార్ధి సంఘాల నాయకులు వేదిస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం జిల్లా కలెక్టర్, రామగుండం పోలీస్ కమిషనర్ కు మంచిర్యాల జిల్లా ట్రస్మా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దామెర్ల సిద్దయ్య, ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, పలువురు కరస్పాండెంట్లు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..... చిన్న, చిన్న కారణాలు చూపుతూ విద్యార్ధి సంఘాల నాయకులు వేధిస్తున్నారని ఆరోపించారు. నేరుగా విద్యాసంస్థల్లోకి వచ్చి తనిఖీలు చేస్తున్నారని, నిబంధనలకు విరుద్దంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారంటూ వేధిస్తున్నారని వివరించారు....