BJP : కమలం దళపతికి సవాళ్లు ఎన్నో ?
BJP : తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధక్షుడిగా ఎన్ రామచంద్ర రావు నియామకం వెనుక ఢిల్లీ పెద్దలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయనకు ఈ పదవి ఎన్నో సవాళ్లతో నిర్మితమై ఉంది. రాష్ట్ర భాద్యతలు చేపట్టడానికి గతంలో మాదిరిగా పార్టీ పరిస్థితి రాష్ట్రంలో లేదు. గతానికంటే బిన్నంగా ఉంది. ఒకవైపు రాబోయే ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయాలి. మరోవైపు నాయకులను సమన్వయం చేసుకుంటూ పోవాలి. పార్టీ తరపున ఒక రాజ్య సభ సభ్యుడు, ఎనిమిది మంది ఎంపీ లు, ఎనిమిది మంది...