BJP : కమలం కుర్చీ బరిలో ఐదుగురు
BJP : తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష నియామకానికి ఎట్టకేలకు కదలిక వచ్చింది. గత కొన్ని నెలలుగా అప్పుడూ, ఇప్పుడూ అంటూ సోషల్ మీడియాలో వార్తలు మోగినై. ఈయనే అధ్యక్షుడు, కాదు ఈయన అధ్యక్షుడు అంటూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. ప్రస్తుత అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ ని తొలగించి కిషన్ రెడ్డి కి పార్టీ పగ్గాలు అప్పగించారు. పగ్గాలు చేతికి వచ్చినప్పటికీ ఆయన పార్టీ పరిపాలనలో విజయవంతం కాలేకపోయారు. కేంద్ర మంత్రిగా తీరిక...