BJP : బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ముహూర్తం ఖరారు.

BJP : తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ప్రస్తుతం అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. జూలై ఒకటిన కొత్త అధ్యక్షుడి ఎంపికకు ముహుర్తాన్ని ఢిల్లీపెద్దలు ఖరారు చేశారు. ఎంపికకు సంబందించిన నోటిఫికేషన్ ను ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయం ప్రకటించనుంది. ఎన్నికకు సంబందించిన ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారు. ఎంపికకు ఢిల్లీ నాయకులు సిద్ధం కావడంతో కొత్త దళపతి ఎవరనేది పార్టీ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కిషన్ రెడ్డి...