ఒంటరివాళ్లవుతున్న గులాబీ శ్రేణులు
BRS : ఉద్యమంలో గులాబీ పార్టీకి అధికారం లేదు. అయినా రాష్ట్ర సాధన కోసం నీ, నా అనే భేదం లేకుండా పార్టీ జెండా మోశారు. కలిసికట్టుగా ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్రము ఏర్పడింది. పదేళ్లు అధికారాన్ని అనుభవించారు గులాబీ శ్రేణులు. పదేళ్ల పరిపాలనలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు. కానీ మూడోసారి అధికారం చేజారిపోయింది. అధికారం ఉన్నన్ని పదేళ్ల కాలంలో గల్లీ కార్యకర్త నుంచి మొదలుకొని ఎంపీ వరకు ప్రజల్లో మెదిలారు. రాజభోగం అనుభవించారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికయి పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన వారు అధికారం...