Jubilee Hills : జూబ్లీహిల్స్ టిక్కెట్ కోసం ఆరుగురు పోటీ !
Jubilee Hills : జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రానేలేదు. కానీ గాంధీ భవన్ చుట్టూ అప్పుడే ప్రదక్షణలు చేస్తున్నారు కొందరు నాయకులు. పార్టీ టికెట్ దక్కించుకోడానికి పెద్ద యుద్ధమే జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. టికెట్ నాకే అంటే, నాకే అంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు. ఏకంగా బి ఫారం దక్కించుకోడానికి ఆరుగురు నాయకులు ఎవరికీ వారే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. పార్టీ ఎవరిని బరిలో దించాలనే ఆలోచనకు ఇంకా రానేలేదు. పార్టీ నిర్ణయం తీసుకోనేలేదు. టికెట్ నాదే అంటూ ప్రకటనలు చేయడం...