CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 16 June 2025, 1:40 pm Posted by : coalbelt 24 News

Telangan : తెలంగాణ రైతులకు శుభవార్త

Telangan : తెలంగాణ రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం శుభవార్త ప్రకటించారు. సోమవారం మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణ, రైతు భరోసా, ఉద్యోగుల డిఎ తదితర సమస్యలు గురించి మంత్రి వర్గ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ….

రాష్ట్రంలోని రైతులకు మంగళ వారం నుంచి రైతు భరోసా నిధులు మంజూరు చేయనున్నామని ప్రకటించారు. నేరుగా రైతుల బ్యాంక్ లో జమ అవుతాయన్నారు. ఎకరానికి ఆరువేల రూపాయల చొప్పున ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో నిధులు జమవుతాయన్నారు. ఒక గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతు భరోసా నిధులను బ్యాంకు లో జమ చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});