CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 12 June 2025, 1:13 pm Posted by : coalbelt 24 News

YS jagan : నేనే గొప్ప రాజకీయవేత్తను…నాకెవ్వరు సాటిలేరు

YS jagan : ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అందుకే వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రి హోదా నుంచి ఎమ్మెల్యే పదవికే పరిమితం చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. చేసిన తప్పులను సరిదిద్దుకోలేక పోతున్నారు. పైగా అసాంఘిక రాజకీయాలకు ఊపిరి పోస్తున్నారు. ప్రజలు అధికారానికి దూరంగా తోసేశారు. అయినా తన గలీజు రాజకీయాలనే రుద్దుతూ ప్రజలకు మరింత దూరమవుతున్నారు. ఏడాదిలోనే ఆయన రాజకీయంగా ఎంత నష్టపోవాలో అంత కంటే ఎక్కువే నష్టపోయారు.

తనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ డిమాండ్ చేయడం, పైగా అసెంబ్లీకి వెళ్లక పోవడం అనేది తానే రాజకీయ గొప్ప మేధావి అనుకున్నారు. ఆయన అసెంబ్లీకి వెళ్ళడు. తన ఎమ్మెల్యేలను వెళ్లనివ్వడు. ఇదో రకమైన తెలివి. ఎక్కడ అనర్హత వేటు పడుతుందో అనే భయంతో సంతకాలకే పరిమితమై తన నియోజకవర్గం ప్రజల పరువు తీశాడు. ఐదు నిమిషాల్లో సంతకం చేసి నేనే గొప్ప నాయకున్ని అంటూ పరువు తీసుకున్నాడు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

వైసీపీ అంటేనే రౌడీలకు, దౌర్జన్యాలకు, దోపిడీలకు పుట్టినిల్లు అనే ముద్ర పడింది. తన పరిపాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడాలో అంతకంటే ఎక్కువగానే పడ్డారు. తన పార్టీ జెండా నీడన ఉంటున్న వారికి నేను అండగా ఉంటున్నానని తెనాలి పర్యటనతో చూపించారు. గ్రాఫ్ పడిపోయిన పార్టీని కాపాడుకోడానికి ప్రయత్నిచండం లేదు. పైగా రాజకీయ వారసుడిగా వచ్చిన పరిజ్ఙానం కూడా లేకుండా పోయింది. అందనంత దూరంలోకి పోయిన పార్టీని ప్రజలకు మరింత దూరం చేస్తున్నాడు. తనకు ప్రజలు వెన్నుపోటు పొడిచారని, ఎన్నికల ఫలితాల ప్రకటించిన రోజు నిరసన కార్యక్రమం గొప్ప రాజకీయ వేత్త నంటూ నిరూపించుకున్నాడు. అధికారం చేపట్టిన రోజు కూటమి ప్రభుత్వం సంబరాల్లో మునిగిపోతే, వైసీపీ దిక్కులు చూడక తప్పలేదు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});