Medigadda : మేడిగడ్డ BRS కు గుదిబండ కానుందా ?
Medigadda : బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నో ఆశలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టించారు. తన పేరు చిరకాలం ఉండాలనే కోరికతో కట్టించిన ప్రాజెక్టు సరిగ్గా ఎన్నికలకు ముందు రాజకీయ కష్టాల్లోకి నెట్టింది. రెండు శాతం ఓట్ల తేడాతో అధికారం పోడానికి గల కారణాల్లో కాళేశ్వరం కూడా ఒక కారణమని రాజకీయ వర్గాల్లో అభిప్రాయం ఏర్పడింది. మేడిగడ్డ కుంగిపోయి ఇప్పుడు బిఆర్ఎస్ అధినేతకు గుదిబండ అయ్యే అవకాశాలు సైతం ఉన్నాయనే అభిప్రాయాలు సైతం రాష్ట్రంలో వ్యక్తమవుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో తెలంగాణాలో రాజకీయ ప్రకంపనలు మొదలైనాయి....