CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 06 June 2025, 1:55 pm Posted by : coalbelt 24 News

Pudina : పుదీనా తో ఆరోగ్యం…డాక్టర్ అవసరమే లేదు

Pudina : పుదీనా ఆకు సువాసన ఎంతో కమ్మగా ఉంటుంది. రుచికి, సువాసనకు చెప్పలేనంత గుణం ఉంటుంది. వంటకాల్లో వాడటం వరకే చాలా మందికి తెలుసు. కానీ ఈ ఆకును వివిధ పద్ధతుల్లో వాడితే ఇంటికి వైద్యుడు అవసరమే లేదంటున్నారు ఆరోగ్యనిపుణులు…

పుదీనా చర్మానికి తాజాదనం అందిస్తాయి, పుదీనా టీ తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, వికారం సమస్యలు నయమవుతాయి. కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. జలుబు, ముక్కుదిబ్బడ సమస్యలు ఆకు వాసన పీల్చితే నయమవుతాయి. కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పుదీనా ఆకుల్లోని విటమిన్‌ సి, రోగనిరోధక శక్తిని పెంచే శక్తి వంతముగా తయారు చేస్తుంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మాంసాహార వంటకాలు బిర్యానీ, మటన్ ,చికెన్ వండేటప్పుడు పుదీనా ఆకులు వేస్తే మంచి రుచిగా ఉంటాయి. మలబద్దకం సమస్య ఉండదు. మజ్జిగలో ఆకులు వేసుకొని తాగితే జీర్ణవ్యవస్థలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ప్రతిరోజూ ఉదయం పుదీనా రసం చేసుకొని, అందులో ఒక్క నిమ్మకాయ రసం కలుపుకొని తాగితే ఎలాంటి జబ్బులు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});