Singareni : సింగరేణిలో రక్షణకే మొదటి ప్రాధాన్యత
Singareni : సింగరేణి సంస్థ కార్మికుల రక్షణకే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని, ఆ తరువాతనే బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదక అంశాలకు ప్రాధాన్యత ఉంటుందని బెల్లంపల్లి రీజనల్ సేఫ్టీ జనరల్ మేనేజర్ రఘు కుమార్ స్పష్టం చేశారు. గురువారం అయన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియా కాసిపేట గని ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గత 15 ఏళ్ల గని ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే జూన్ మాసంలోనే అధికంగా ప్రమాదాలు జరిగినట్టుగా రికార్డులు చెబుతున్నాయన్నారు....