CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 05 June 2025, 12:21 pm Posted by : coalbelt 24 News

Singareni : సింగరేణిలో రక్షణకే మొదటి ప్రాధాన్యత

Singareni : సింగరేణి సంస్థ కార్మికుల రక్షణకే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని, ఆ తరువాతనే బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదక అంశాలకు ప్రాధాన్యత ఉంటుందని బెల్లంపల్లి రీజనల్ సేఫ్టీ జనరల్ మేనేజర్ రఘు కుమార్ స్పష్టం చేశారు. గురువారం అయన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియా కాసిపేట గని ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గత 15 ఏళ్ల గని ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే జూన్ మాసంలోనే అధికంగా ప్రమాదాలు జరిగినట్టుగా రికార్డులు చెబుతున్నాయన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు రక్షణ చర్యలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అనంతరం ఏరియా రక్షణ అధికారి మాటూరి రవీందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంటి నుంచి రక్షణ తో రావాలని మోటర్ సైకిల్,కారులో వచ్చే వారు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి రావాలని కోరారు. కె కె గ్రూపు ఏజెంట్ రాంబాబు మాట్లాడుతూ ప్రమాదాలు జరగకుండా మానిటర్,ఇంప్లిమెంటర్ ప్రణాళిక బద్దంగా సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(sop) ప్రకారం చేస్తే ప్రమాదాలను అరికట్టడానికి అవకాశం ఉందన్నారు. గుర్తింపు సంగజం ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేష్ మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన అలవాట్లు ఉన్నప్పుడే క్రమ పద్ధతిలో పనులు చేసుకుంటూ వెళుతామని ముందుగా క్రమశిక్షణ అలవర్చుకోవాలి కోరారు. తొందరపాటు చర్యల వల్ల ప్రమాదాలు జరుగుతాయని ఆలోచించి చేస్తే నివారించడం సులభమౌతుందని అన్నారు.

మేనేజర్ భూశంకరయ్య గారు మాట్లాడుతూ కాసిపేట గని లో గతం కంటే ఇప్పుడు ప్రమాదాలు తగ్గాయన్నారు. సూపర్ వైజర్ల పర్యవేక్షణ లో పని చేసినప్పుడే ప్రమాదాలను నివారిస్తామన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలోఏఐటీయూసీ పిట్ సెక్రెటరీ మీనుగు లక్ష్మినారాయణ, రక్షణ అధికారి నిఖిల్ అయ్యర్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, సంక్షేమ అధికారి జీషాన్, అండర్ మేనేజర్ సుమన్ రెడ్డి , కార్మికులు పాల్గొన్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});