CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 05 June 2025, 10:00 am Posted by : coalbelt 24 News

KCR : సార్… ఎప్పుడు వస్తారో ?

KCR : ఇదిగో వస్తున్నాను… ప్రజాక్షేత్రంలో అడుగుపెడుతున్నాను …. నేను దెబ్బ కొడితే మాములుగా ఉండదు….అంటూ కేసీఆర్ బాణాలు వదిలారు. ఆ మాటలు విన్న గులాబీ నేతల్లో కూడా ఉషారు పుట్టింది. మన సార్ వస్తున్నాడు. ఒక్కొక్కరి దుమ్ము దులిపేస్తాడు… అంటూ గులాబీ శ్రేణుల్లో ఆనందం నిండి పోయింది. రజతోత్సవ సభలో మాట్లాడిన మాటలకూ క్యాడర్ లో కూడా ఉత్సహం నిండిపోయింది. కేసీఆర్ మాటలకు పార్టీ శ్రేణుల్లో నిండిన ఉత్సహం, నిరాశకు గురిచేసింది.

తెలంగాణ ఆగమాగమవుతోంది. ప్రజల గోస చూస్తేంటే నాకు దుఃఖం వస్తోంది. ప్రజల భాదలు చూస్తుంటే తట్టుకోలేక పోతున్న. నేను వస్తున్న. ఇక ప్రజా క్షేత్రంలో కొట్లాడుతా అంటూ రజతోత్సవ సభలో మాట్లాడి గులాబీ నేతల్లో జోష్ నింపారు కేసీఆర్. ఆ మాటలు విన్న నేతలకు కూడా జూన్ రెండున ప్రజా క్షేత్రంలోకి సార్ రావడం ఖాయమని కళలు కన్నారు. అమర వీరులకు నివాళులు అర్పించి నిత్యం ప్రజల మద్యలో కొనసాగుతారని, ఇక రాబోయేది కూడా గులాబీ పరిపాలనే అంటూ గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఏమైనది. కనీసం అమర వీరులకు నివాళులు అర్పించడానికి కూడా సార్ కు తీరిక దొరకలేదు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కేసీఆర్ ఫామ్ హౌజ్ గడప దాటి బయటకు రాకపోవడానికి ప్రధాన కారణం ఎమ్మెల్సీ కవిత అంటున్నారు. ప్రస్తుత ఇంటి పోరుతో సతమతమవుతున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో కేసీఆర్ బయటకు వస్తే కవిత సమస్యను ఆయన ముందుకు మీడియా తీసుకురావడం తప్పదు. అందుకు సమాధానం కూడా చెప్పక తప్పదు. నోరు విప్పితే కూతురు కవిత ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంది. అప్పుడు ఆయన మాటలు ఎక్కడికయినా దారితీయవచ్చు. అందుకనే మౌనం వహించి గడప లోపల గడిపితేనే మంచిదనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});