CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 02 June 2025, 4:10 pm Posted by : coalbelt 24 News

Govt Hm : ప్రభుత్వ పాఠశాలలో తన పిల్లలను చేర్పించిన ప్రధానోపాధ్యాయుడు

Govt Hm : కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతల ప్రభాకర్ తన ఇద్దరు పిల్లలను మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. చింతల మృణాళిని ని మూడో తరగతిలో, చింతల శివకేశవు ను ఒకటో తరగతిలో మండలంలోని మహ్మదాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2025-26 విద్యాసంవత్సరంలో చేర్పించారు.

ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, వారితోనే నాణ్యమైన విద్య విద్యార్థులకు అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, రెండు జతల దుస్తులతోపాటు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామన్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలని గ్రామస్తులను కోరారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});