CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 24 May 2025, 8:38 am Posted by : coalbelt 24 News

Harish Goud : ఉద్యమపార్టీ అధికారంలో కానరాని నియామకాలు

బిఆర్ఎస్ అధికారంలో అస్థవ్యస్తంగా విద్యావ్యవస్థ
కోర్టు చుట్టూ తిరుగుతున్న ఉద్యమకారులు
కాంగ్రెస్ ప్రభుత్వంపై కోటి ఆశలు
తెలంగాణ విద్యార్థి సమాఖ్య(TVS) రాష్ట్ర అధ్యక్షుడు పూదరి హరీష్ గౌడ్

Harish Goud : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన ఉద్యమ పార్టీలో ఎందరో ఉద్యమకారులు పాల్గొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పంపకాలలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తును ఎగసిన మలిదశ ఉద్యమంలో ఎందరో విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రము ఏర్పడితే ఎందరికో ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశించారు. కానీ ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నియామకాలు కానరాలేదని తెలంగాణ విద్యార్థి సమాఖ్య(TVS) రాష్ట్ర అధ్యక్షుడు పూదరి హరీష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం అయన మంచిర్యాలలో మాట్లాడుతూ…..




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చదువులు పక్కన పెట్టి పోరాటాలు చేసిన వారికి రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఎలాంటి మేలు జరుగలేదని ఆయన ఆరోపించారు. రిలే, ఆమరణ దీక్షలు, అసెంబ్లీ ముట్టడి, మిలియన్ మార్చ్ ఇలా సందర్భం ఏదైనా సరే విద్యార్థులు
ఉద్యమంలో ముందున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కొలువులు వస్తాయని ఆశించిన ఆశలు అడియాశలయ్యాయని హరీష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఏ ఆశయాలతో అయితే జీవితాలను పణంగా పెట్టి ఉద్యమించారో వారి ఆశలు అడియాశలైనాయని అయన ఆరోపించారు. .

ఉద్యమపార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రధానంగా విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయ్యిందన్నారు. రాష్ట్రం ఏర్పడితే ఉద్యమకారులను, అమరవీర కుటుంబాలను ఆదుకుంటామనే మాట నీటి మూటగానే మిగిలిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసులతో కోర్టుల చుట్టూ తిరగవలసిన దౌర్భాగ్య స్థితిని నేటికీ అనుభవించక తప్పడంలేదన్నారు.

గత ప్రభుత్వం నెరవేర్చలేని తెలంగాణ ప్రజల ఆశయాలను తాము నెరవేర్చుతామని ఆశచూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకోవాలన్నారు. విద్య, వైద్య సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఉద్యమకారులుగా స్వాగతిస్తున్నామన్నారు. గత ముఖ్యమంత్రి వలె అహంకారానికి తావు లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన పాలన అందించాలన్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});