Congress : కాంగ్రెస్ లో మొదలైన గుబులు
Congress : బిఆర్ఎస్ లో ఏర్పడిన ఇంటిపోరు కాంగ్రెస్ పార్టీలో ఆనందం కంటే ఆందోళనే ఎక్కువ చేసిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన ఎంపీ మల్లు రవి ఇటీవల విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో అయన మాట్లాడుతూ బిఆర్ఎస్, బిజెపి, టీడీపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకుంటున్నాయని ఆరోపించారు. అక్కడితో ఆగకుండా రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడం ఖాయమంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలకు...