Singareni : సింగరేణిలో నూతన బదిలీ విధానాన్ని రద్దు చేయాలి.
Singareni : సింగరేణి యాజమాన్యం అమలు చేయబోతున్న నూతన బదిలీ విధానం కు సంబందించిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని ఐఎన్టియుసి మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య యాజమాన్యంను డిమాండ్ చేశారు. మంగళవారం అయన యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ఏరియా లోని కాసిపేట గనిపై నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం గని మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా దేవి భూమయ్య కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ .... కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తీసుకువచ్చిన...