CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 03 May 2025, 6:39 pm Posted by : coalbelt 24 News

Job : పది పాసైతే పెద్ద కంపెనీలో ఉద్యోగం

Job : ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత చదివినా ఉద్యోగం దొరకడం లేదు. చదివిన చదువుకు తగిన ఉద్యోగాలు కూడా రావడంలేదు. చాలా రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్య వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వ కొలువు సాధించాలంటే పోటీ కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సంస్థ పదోతరగతి పాసైన వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అయితే ఒక కండిషన్ పెట్టింది ఆ సంస్థ . ఆ కండిషన్ ప్రకారం ఒప్పందం చేసుకున్న వారికీ తన సంస్థలో ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించింది…. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం…

ప్రభుత్వ ఐటిఐ సంస్థలకు అనుబందంగా ఏటీసీ సంస్థలు ఉన్నవి. వీటికి టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ సంస్థ నిధులు అందజేస్తుంది. ఈ నిధుల ద్వారా ఏటీసీ సంస్థలు పదోతరగతి పాసైన వారికి అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ ఇస్తారు. ఏడాది పాటు టాటా సంస్థ రూపొందించిన సిలబస్ ఆధారంగా శిక్షణ అందజేస్తారు ఏటీసీ సంస్థల్లో.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

టాటా సంస్థ ఏటీసీ సంస్థల్లో ఇచ్చిన శిక్షణను సకాలంలో నిబంధనల మేరకు పూర్తి చేయాలి. శిక్షణ పూర్తి చేసిన వారికీ టాటా సంస్థ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూ లో ప్రతిభ కనబరచిన వారిని టాటా, మహీంద్రా సంస్థలో ఉద్యోగంలో చేరుతారు. పై చదువులు చదవడానికి స్తొమత లేనివారు, చదివే పరిజ్ఞానం లేనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఐటీఐ సంస్థలకు అనుభందంగా ఉన్న ఏటీసీ కార్యాలయాల్లో సంప్రదించాలి.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});