CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 6:01 pm Posted by : coalbelt 24 News

Result : పదోతరగతి ఫలితాలకు తొలగిన అడ్డంకి… ఫలితాల వెల్లడి ఎప్పుడంటే ?

Result : తెలంగాణ రాష్ట్రంలో 2024 – 2025 విద్యాసంవత్సరంలో చదివిన పదోతరగతి విద్యార్థులు ఏప్రిల్ లో పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ కూడా పది పరీక్షలను కూడా పకడ్బందీగా నిర్వహించింది. కొందరు ఉపాధ్యాయుల వలన అక్కడక్కడా కొంత మేరకు విద్యార్థులకు నష్టం వాటిల్లింది. జవాబు పత్రాల మూల్యాంకనంలో కూడా ఎలాంటి నష్టం విద్యార్థులకు ఎదురుకాకుండా విద్యాశాఖ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.

మూల్యాంకనం పూర్తికావడంతో ఫలితాలను వెల్లడించడానికి ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు అధికారులు. అయితే గత సంవత్సరం ఉన్నటువంటి నిర్ణయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తూ నిర్ణయం తీసుకొంది ఈ నేపథ్యంలో ఫలితాలను వెల్లడించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

2024-2025 విద్యాసంవత్సరంలో చదివిన విద్యార్థులకు మెమోల్లో సబ్జెక్ట్ వారీగా మార్కులతో పాటు గ్రేడ్ లను కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. మెమోలపై స్పష్టత రావడంతో ఫలితాలను రెండుమూడు రోజుల్లో అధికారికంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});