CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 26 April 2025, 6:02 pm Posted by : coalbelt 24 News

30 lakhs : రోజు పెట్టుబడి రూ :50.. సంపాదన రూ : 30 లక్షలు

30 lakhs : పేద ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. అయినప్పటికీ కొందరికి ఆ పథకాలు అందడంలేదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 1995 లో ప్రవేశపెట్టింది. అయినప్పటికీ ఈ పథకం పేదవారికి అందడంలేదు. ముక్యంగా గ్రామీణ ప్రాంతాల వారు అభివృద్ధి చెండానికి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంది.

19 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. మెచ్యూరిటీ కాలం 55 , 58 , 60 ఏళ్లు నచ్చిన విధంగా ఎంచుకోవచ్చు. ఈ పథకంలో రూ.10వేల నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. ప్రీమియం చెల్లించడానికి నెల, త్రైమాసికం, అర్ధ సంవత్సరం కేటాయించుకోవచ్చు.. అందులో మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు..




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఉదాహరణకు 19 సంవత్సరాల వయసు ఉన్న ఒక వ్యక్తి రూ.10 లక్షల ప్రీమియంను ఎంపిక చేసుకుంటే, అతనికి 55 ఏళ్లు వచ్చే నాటికి నెలకు రూ.1,515 లను ప్రీమియంగా చెల్లించాలి. అంటే రోజుకు 50 రూపాయలు చెల్లిస్తున్నట్టు. అదే వ్యక్తి 58 సంవత్సరాలు ఏఎంపిక చేసుకుంటే నెలకు రూ.1,463, 60 సంవత్సరాల కు రూ.1,411 ప్రీమియం చెల్లించాలి.

55 ఏళ్ల కాలానికి పెట్టుబడి పెడితే రూ.31.60 లక్షలు, అదే విదంగా 58 ఏళ్లకు 33.40 లక్షలు, 60 ఏళ్లకు రూ.34.60 లక్షలు మెచ్యూరిటీ కాలానికి పెట్టుబడి పెట్టిన వ్యక్తి చేతికి అందుతాయి. గ్రామ సురక్ష యోజన పథకం కింద 19 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఈ పథకానికి అర్హులు. మరిన్ని వివరాల కోసం ఆధార్ కార్డు తో సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కు వెళితే తెలుసుకోడానికి అవకాశం ఉంది.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});