CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 19 April 2025, 5:52 pm Posted by : coalbelt 24 News

inter result : తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ప్రకటించే తేదీ ఇదే

inter result : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం చదివిన విద్యార్థులు తమ పరీక్ష ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. పరీక్ష అయితే బాగానే రాశాం. కానీ మార్కులు ఎలా వస్తాయో అని చాలా మంది విద్యార్థులు దిగులుగా ఉన్నారు. సైన్స్ గ్రూప్ విద్యార్ధులకి ఫిబ్రవరి 3 తేదీ నుంచి అదే నెల 22 తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలను ఇంటర్మీడియేట్ బోర్డు అధికారులు నిర్వహించారు.

వాటి అనంతరం సైన్స్ , ఆర్ట్స్ విద్యార్ధులకు కలిపి మార్చ్ 5 తేదీ నుంచి అదే నెల 25 వరకు థీరీ పరీక్షలను నిర్వహించారు. థీరీ పరిక్షల మూల్యాకనం కూడా బోర్డు అధికారులు సకాలంలో పూర్తి చేశారు. ఫలితాలను ప్రకటించడానికి సాంకేతిక పరంగా బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏప్రిల్ 22 న ప్రకటించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా ఇంటర్ బోర్డు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ ఫలితాలను రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటిస్తారని సంబంధిత అధికార వర్గాలు ప్రకటించారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});