BJP : ఈటల ఒంటరి అయ్యారా ?
BJP : భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ ఈటల రాజేందర్ కొద్ది రోజుల నుంచి రాజకీయ పరంగా నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు కమలం గూటిలో రాష్ట్రములో ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా ఉండేది. ఇటీవల కొన్ని పరిస్థితులను గమనిస్తే బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఒక్కటైనట్టుగా తెలుస్తోంది. వీరిద్దరూ ఈటల రాజేందర్ కోసమే ఏకమైనట్టుగా కమలం గూటిలో గుసగుసలు జరుగుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక అంశం గత...