CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 09 April 2025, 9:13 am Posted by : coalbelt 24 News

kadiyam : బిఆర్ఎస్ నేతలకు కడియం శ్రీహరి ఏమని సవాల్ విసిరాడో తెలుసా ?

kadiyam : బిఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలలో కడియం శ్రీహరి ఒకరు. అందుకే గులాబీ నేతలు కడియం శ్రీహరిని టార్గెట్ చేశారనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయంతో ఆయన కాంగ్రెస్ లో చేరాడు. తన కూతురు కడియం కావ్య రాజకీయ భవిష్యత్తు కోసమే ఆయన పార్టీ మారారు.

కడియం శ్రీహరి ని ఢీకొనడానికి వరంగల్ జిల్లా నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు కూడా లక్ష్యంగా చేసుకున్నారు. కడియం పై భూకబ్జా ఆరోపణలు గులాబీ నేతలు చేస్తున్నారు. దేవనూరు గుట్టల్లో రెండు వేళ ఎకరాల భూమి కబ్జా చేసాడంటూ ఇరకాటంలో పడేశారు. మరో ప్రాంతంలో కూడా యాబై ఎకరాల భూమి కబ్జా చేసి, బినామీలకు అప్పగించారనేది కూడా మరొక ఆరోపణ.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

బిఆర్ఎస్ నేతల ఆరోపణపై కడియం శ్రీహరి కూడా తీవ్రంగానే స్పందించారు. తాను ఒక గుంట భూమి కబ్జా చేసినట్టుగా నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. అంతే కాదు రాజీనామా చేసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఇంటిలో గులాంగా పనిచేస్తానని సవాల్ విసిరారు. ఒకవేళ వారిద్దరూ తనపై చేసిన ఆరోపణలను నిరూపించకపోతే వారు గులాంలుగా నా వద్ద ఉండాలంటూ సవాల్ విసిరారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});