CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 04 April 2025, 9:05 am Posted by : coalbelt 24 News

sports : స్పోర్ట్స్ కోటాలో భారీ వేతనంతో ఉద్యోగాలు

sports : హైదరాబాద్ లోని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఉద్యోగం చేరిన నాటి నుంచి పర్మినెంట్. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఉద్యోగం కాబట్టి భవిష్యత్తులో ప్రమోషన్ లు ఉంటాయి. ప్రమోషన్ తో పాటు వేతనం కూడా భారీగానే పెరుగుతుంది. ప్రజల్లో కూడా మంచి ఆదరణ ఉంటుంది.

టాక్స్ అసిస్టెంట్ విభాగంలో 28, మల్టి టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ లు 26 ఖాళీగా ఉన్నాయి. అథ్లెటిక్, క్యారం, చెస్, క్రికెట్, హాకీ, కబడ్డీ, స్విమ్మింగ్, టెన్నిస్, వాలీబాల్, ఫుట్ బాల్, బాడీ బిల్డింగ్, బాస్కెట్ బాల్ తదితర క్రీడల్లో ప్రావిణ్యం ఉన్న వారు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. టాక్స్ అసిస్టెంట్ పోస్టుకు 18 నుంచి 27 ఏళ్ళు, ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

టాక్స్ అసిస్టెంట్ వేతనం 25, 500, ఎంటీఎస్ వేతనం 18, 000 తో ప్రారంభమవుతుంది. వీటికి అదనంగా మరికొన్ని అలవెన్సులు కూడా కలిపి వేతనం రానుంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు హైదరాబాద్ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ లో ఉన్నవి.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});