CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 04 April 2025, 7:11 am Posted by : coalbelt 24 News

Onion : వేసవిలో ఉల్లిపాయలు ఎలా పనిచేస్తాయంటే …….

Onion : వేసవి కాలం అంటే ఎండలు మండే కాలం. తట్టుకోలేనంత ఉక్కపోత. విపరీతంగా చెమటలు. తీరని దాహం. ఎదో ఒకటి చల్లని పదార్థం కడుపులో వేయాలనిపిస్తుంది. కానీ అసలు, సిసలైన ఉల్లిగడ్డ వేసవి కాలంలో శరీరానికి ఎంత మేలు చేస్తుందో చాలా మందికి తెలియదు. ఆ ఉల్లి గడ్డ గురించి ఇప్పుడు తెలుసు కుందాం…….

ఉల్లి పాయలో విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఉల్లిపాయల్లో నీరు పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వేసవిలో ఉల్లిపాయ తింటే మన శరీరానికి అవసరమైన హైడ్రేషన్ అందుతుంది. ఇందులో ఉండే సల్ఫర్‌, పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఉల్లిపాయలు ఆహారంలో ప్రతిరోజూ కనీసం వంద గ్రాములు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి సక్రమంగా ఉంటుంది. ఉల్లిపాయలను ప్రతిరోజూ తీసుకోవడం వలన హానికరమైన UV కిరణాలు వేసవి సూర్యునితో సంబంధం ఉన్న పర్యావరణ టాక్సిన్స్ నుండి రక్షణగా నిలుస్తాయి.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});