CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 04 April 2025, 8:01 am Posted by : coalbelt 24 News

Job : ఇంజనీరింగ్ విద్యార్థులకు భారీ వేతనంతో ఉద్యోగం.

Job : ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతి, యువకులకు మంచి శుభవార్త ప్రకటించింది EIL సంస్థ. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని సంస్థ కాబట్టి ఉద్యోగంలో చేరిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. భారీ వేతనంతో నోటిఫికేషన్ ప్రకటించింది. పదోన్నతులతో వేతనం కూడా భారీగానే పెరుగుతుంది. శిక్షణ పూర్తయిన వారికి ఉచిత వసతి ఉంటుంది.

మొత్తం ఖాళీలు 52/ దరఖాస్తు గడువు ఏప్రిల్ 7 గ ప్రకటించింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంజనీరింగ్ లో కెమికల్, మెకానికల్, సివిల్, ఎలక్రికల్, విభాగాల్లో 65 శాతం మార్కులు సాధించిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. జనరల్ అభ్యర్థులు 25 ఏళ్ళు , ఓబిసి వారు 28 ఏళ్ళు, ఎస్సి, ఎస్టీ, 30 ఏళ్ళు, PWD -జనరల్-35 ఏళ్ల వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు, 2024, 2025 లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. శిక్షణ కాలంలో 60 వేల వేతనం తో పాటు నివాసం వసతి ఉంటుంది. ఎంపికకు సంబంధించిన నిబంధనలను EIL వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవాలి.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});