CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 02 April 2025, 3:42 pm Posted by : coalbelt 24 News

coffee : పళ్ళు తోమకుండానే కాఫీ తాగకండి. ఎంత ప్రమాదమో తెలుసా ?

Coffee : ఉదయం నిద్ర లేవగానే పళ్ళు తోమకుండానే కొందరు కాఫీ, టీ తాగుతారు. పళ్ళు తోమిన తరువాత కొందరు పాలు, టీ , కాఫీ తాగుతారు. కానీ పళ్ళు తోమకుండానే కాఫీ తాగితే కడుపులో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాన్నీ ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు……

ఖాళీ కడుపుతో కాఫీ తాగితే కడుపులో ఆమ్లం అధికంగా ఉత్పత్తి అవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఖాళీ కడుపుతో కాఫీ తీసుకుంటే పలు అనారోగ్య సమస్యలు కడుపులో తయారవుతాయి. కాఫీలోని కెఫిన్ నిద్రకు ఇబ్బందిగా తయారవుతుంది. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల కడుపులో ఆమ్ల శాతం పెరుగుతుంది. కడుపులో పూతలు, గుండెల్లో మంట, అజీర్ణం వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తయారవుతాయి. కడుపు ఉబ్బరం, కడుపులో అసౌకర్యం, బిగుతుగా అనిపించడం వంటి అజీర్ణ సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. గర్భిణీలు లేదా పాలిచ్చే తల్లులు ఖాళీ కడుపుతో కాఫీ తాగడం అసలే ఆరోగ్యానికి మంచిది కాదు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});