CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 25 March 2025, 5:59 am Posted by : coalbelt 24 News

Ganapathi : ఏ ఒక్క గణపతిని దర్శించుకున్నా చాలు… మీ దోషాలు పోవడం ఖాయం

Ganapathi : హిందూ బంధువులు వినాయకుడిని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఈ గణనాథుడికి చాలా పేర్లు ఉన్నవి. గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, గణనాథుడు ఉన్నవి. దేశంలో చాలా ప్రాంతాల్లో గణనాథుడికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది. అయితే ఈ ఆలయాల్లో ఏ ఒక్క ఆలయాన్ని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసిన నేపథ్యంలో ఎలాంటి జన్మ దోషం ఉన్నా తొలగిపోతుందని వేద పండితులు చెబుతున్నారు.

ముంబైలోని సిద్ధివినాయక ఆలయం దేశంలోని ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి గా చెబుతారు. సామాన్యులే కాదు బాలీవుడ్, టీవీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు, సెలబ్రేటీలు కూడా ఈ ఆలయానికి చేరుకొని తమ కోరికలను గణపతికి చెప్పుకుంటారనే పేరు ఉంది. ఈ ఆలయం దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని చాంద్‌పోల్ ప్రాంతంలో మోతి దుంగ్రి ఆలయం ఉంది. ఇక్కడ గణపతికి పెసరపప్పు లడ్డులను నైవేద్యంగా పెడతారు. ఈ ఆలయంలో 800 సంవత్సరాల పురాతన గణపతి విగ్రహం ఉంది. ఈ ఆలయంలో కొత్త వాహనాన్ని పూజిస్తే.. ప్రమాదం జరిగే అవకాశాలు చాలా తక్కువ అని నమ్ముతారు.

పూణేలోని సుందర్ నగర్‌లో ఉన్న దగదుషేత్ హల్వాయి గణపతి ఆలయం. బంగారంతో చేసిన గణపతి విగ్రహాన్ని చూసే ఏ భక్తుడికైనా అతని కష్టాలన్నీ తొలగిపోతాయని, కోరికలు కూడా నెరవేరుతాయనే విశ్వాసం ఉంది భక్తుల్లో.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న ఖజ్రానా ఆలయంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించే ఏ భక్తుడి దుఃఖానైనా విఘ్నహర్త మూర్తి తొలగిస్తుందని, అతని కోరికలను కూడా తీరుస్తాడని నమ్మకం. గణపతి భక్తులు ఏడాది పొడవునా ఖజ్రానా ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

గణేశుడి ఆలయం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో ఉంది. ప్రేమికులు భారీ సంఖ్యలో తమ ప్రేమను గెలిపించమని కోరుకుంటూ ఈ ఆలయంలో ప్రేమ జంటలు పూజలు చేస్తారు. గణపయ్య జంటలను కలిపే దైవంగా ప్రసిద్ది పొందాడు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});