CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 25 March 2025, 8:03 am Posted by : coalbelt 24 News

Egg :కోడి గుడ్డు శాకాహారమా.. మాంసాహారమా…. ???

Egg : ప్రతిరోజూ ఒక కోడి గుడ్డు తింటే ఆరోగ్యం చాలా బాగుంటదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కోడి గుడ్డును ఏవిదంగా తిన్నా ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు. ఇంతకూ కోడి గుడ్డు శాకా హారమా, మాంస హారమా అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఆ విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…….

ఎక్కువ శాతం ప్రజలు గుడ్డును మాంసాహారంగానే భావిస్తారు. శాఖాహారులు వీటిని తినరు. గుడ్డు రెండు రకాలుగా చెబుతారు. మొదటి రకం ఫలదీకరణం చేసింది, రెండో గుడ్డు ఫలదీకరణం చేయనిది. మొదటి రకం గుడ్డులోంచి కోడి పిల్ల పుడుతుంది. రెండోరకం గుడ్డు ను కేవలం ఆహారంగా వాడుతాం. వీటిలోనుంచి పిల్లలు పుట్టవు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కోడి పెట్ట, కోడి పుంజుల పునరుత్పత్తి చర్య వల్ల పెట్టిన కోడి గుడ్డును ఫలదీకరణ గుడ్డు అంటారు. కోడి పుంజు సహకారం లేకుండానే కోడిపెట్ట పెట్టిన గుడ్డును ఫలదీకరణం చేయని గుడ్డు అని అంటారు. కోడి పిల్ల అభివృద్ధి చెందని గుడ్లను కోళ్ల ఫారంలలో సేద్యం చేస్తారు. అటువంటి గుడ్లను శాఖాహారం అని చెప్పడానికి వీలుందని కూడా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

కోడి గుడ్డు పెట్టినంత మాత్రాన దాన్నిమాంసాహారం అనరాదు. జంతువుల నుంచి వచ్చే ప్రతి పదార్థాన్ని కూడా మాంసాహారం అనలేము. ఎందుకంటే జంతువుల నుంచి పాలు తీస్తున్నాం. అటువంటప్పుడు పాలను కూడా మాంసాహారం అనలేము. కాబట్టి గుడ్డును శాకాహారం అని చెప్పవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});