Bibipeta : చలివేంద్రం ప్రారంభం
Bibipeta : బీబీపేట మండలంలోని యాడారం, శివరామిరెడ్డిపల్లి గ్రామాల సౌకర్యార్థం ఆయా గ్రామాల్లో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ వేసవి కాలంలో విద్యార్థులు, రైతులు, కూలీలు దాహం తీర్చుకోడానికి ఇబ్బందులు పడుతుంటారు. వారి సౌకర్యార్థం గ్రామస్తులు సమిష్టిగా ఏర్పడి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్యమంలో .... యాడారం, శివరామిరెడ్డిపల్లి గ్రామాల మాజీ సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, మాజీ వార్డు సభ్యులు, గ్రామాల పెద్దలు, యువతతో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.