CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 23 March 2025, 5:27 am Posted by : coalbelt 24 News

summer : వేసవిలో ఇవే మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష

summer : వేసవి కాలం వచ్చిందంటే వడదెబ్బ భయం పట్టుకుంటుంది. చలి, వాన ను తట్టుకుంటాం. కానీ ఎండలో మాత్రం పనులు చేసుకోలేము. కొన్ని సందర్భాల్లో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. ఆ సమయంలో బయటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంటుంది. వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి వీటిని క్రమం తప్పకుండ అంటే వేసవి కాలం పూర్తయ్యే వరకు తీసుకుంటే అవి మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం…..

అరటి పండులో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలో పొటాషియం, కార్బోహైడ్రేట్లు ఉండటంతో శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అరటిపళ్ళు జీర్ణశక్తిని బలంగా తాయారు చేస్తాయి. కాబట్టి ఉదయం, సాయంత్రం ఒక్కొక్కటి ఆహారంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

పాలకూరలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ సాయిని పెంచుతుంది. అవసరమైనంత ఆక్సిజన్ ను కూడా అందిస్తుంది. శరీరంలో ఐరన్ తక్కువ ఉన్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వారంలో రెండుసార్లయినా ఆహారంగా తీసుకోవాలి.

ఓట్స్‌లో అధికంగా ఫైబర్ ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అలసటగా అనిపించేవారు రోజువారీ ఆహారంలో ఓట్స్‌ను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

డార్క్ చాక్లెట్ తినడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరానికి తక్షణ శక్తిని అందించేందుకు ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లను అందించి శక్తి స్థాయిని పెంచుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});