Singareni : కొత్త గనులతోనే సింగరేణి అభివృద్ధి
Singareni : సింగరేణి సంస్థ అభివృద్ధి చెందాలంటే కొత్త గనులతోనే సాధ్యమవుతుందని SCWU-AITUC రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టం చేశారు. శనివారం ఆయన మందమర్రి ఏరియా లోని కాసిపేట-1 గని కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ రానున్న రోజుల్లో పలు సింగరేణి గనులు మూతపడే అవకాశం ఉందన్నారు. కొత్త గనులు ఏర్పడితేనే సింగరేణిలో ఉద్యోగ నియామకాలు వస్తాయని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ ఎప్పుడు కూడా రాజీపడదన్నారు. హక్కుల కోసం పోరాడే సంఘం ఏఐటీయూసీ ఒక్కటేనన్నారు. రాబోయే...