Singareni : రాష్ట్రంలోని కొత్త బొగ్గు గనులను సింగరేణికే కెటాయించాలి.

Singareni : తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తి చేయడానికి అనుకూలంగా ఉన్న కొత్త బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని సింగరేణి గుర్తింపు సంఘం, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మంచిర్యాల జిల్లా, మందమర్రి ఏరియాలోని సింగరేణి కాసిపేట -1 గని వద్ద కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రానున్న మరికొద్ది నెలల్లో కొన్ని సింగరేణి గనులు మూతపడే అవకాశాలు ఉన్నాయన్నారు. తద్వారా కార్మికుల సంఖ్య కూడా తగ్గే అవకాశాలు...