CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 11 March 2025, 2:48 pm Posted by : coalbelt 24 News

Singareni : వకిల్ పల్లి గని ని సంధర్శించిన డైరెక్టర్ పి&పి

Singareni : పెద్దపల్లి జిల్లా, రామగుండము రీజియన్ లోని ఆర్జీ 2 ఏరియా సింగరేణి వకీల్ పల్లి గనిలోని పనిస్థలాలను డైరెక్టర్ ప్లానింగ్ & ప్రాజెక్ట్స్ కె.వెంకటేశ్వర్లు మంగళవారం సంధర్శించారు. సర్వే ప్లాన్ ద్వారా గనిలో నడుస్తున్న కంటిన్యూస్ మైనర్, ఎల్ హెచ్ డి పని స్థలాలను, ఉత్పత్తి, ఉత్పాదకతలకు సంభందించిన పరిస్థితులను పరిశీలించారు. అనంతరం ఏరియా జనరల్ మేనేజర్ బి వెంకటయ్యతో పాటు ఇతర అధికారులతో కలిసి మరమత్తులు చేపట్టిన కంటిన్యూస్ మైనర్ యంత్రాన్ని తనిఖీ చేశారు. ఉత్పత్తికి వినియోగంలోకి వచ్చే విధంగా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అదే విదంగా బంకర్ పనులను కూడా పరిశీలించి బొగ్గు రవాణాకు ఉపయోగపడేలా చూడాలని ఆదేశించారు. డైరెక్టర్ గా పదవి భాద్యతలు స్వీకరించి మొదటి సారి గనికి వచ్చిన సందర్బంగా వెంకటేశ్వర్లు ఏరియా ఉన్నతాధికారులు, అధికారులు ఘనంగా సన్మానించారు. ఏరియా జనరల్ మేనేజర్ బి.వెంకటయ్య, ఏరియా ఇంజినీర్ నరసింహ రావ్, ఏజెంట్ ఏ. నెహ్రూ, మేనేజర్ రవి కిరణ్, డీజీఎం వర్క్ షాప్ ఎర్రన్న, గ్రూప్ ఇంజినీర్ చంద్ర శేఖర్, సర్వేయర్ రైమత్అలీ, ఏరియా సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్, ఫిట్ ఇంజినీర్ ఫణి కుమార్, డివైపిఎం శ్యామ్ ప్రసాద్, కంటిన్యూస్ మైనర్ కు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});