CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 11 March 2025, 5:31 am Posted by : coalbelt 24 News

Home : ఇతరుల నుంచి ఈ వస్తువులను తెచ్చుకుంటే అప్పుల పాలే

Home : ఎవరైనా ఉచితంగా వస్తువులు ఇస్తున్నారంటే చాలు ఎగబడి తెచ్చుకుంటాం. వాళ్ళు వాడిన వస్తువులు కావచ్చు, ఇంటిలో దాచిపెట్టిన కొత్త వస్తువులు కావచ్చు తెచ్చుకోడానికి అసలే ఆలోచించకుండా తెచ్చి ఇంటిలో పెట్టుకుంటాం. వాళ్ళు ఇచ్చే వస్తువులు తెచ్చుకుంటే మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనేది అసలే ఆలోచించరు. కానీ ఆ వస్తువులు తెచ్చుకుంటే మాత్రం మీకు, మీ కుటుంబానికి దరిద్రం చేరినట్టేనని వేద పండితులు చెబుతున్నారు. ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…..

చెప్పులు ఎవరైనా కొత్తవి కొనిస్తానంటే అసలే తీసుకోరాదు. అదే విదంగా మనం ఎక్కడికయినా వెళ్ళినప్పుడు చెప్పులు పోతే, ఇంటికి వచ్చే వరకు కూడా చెప్పులు కొనరాదు. అక్కడే ఎవరైనా వాళ్ళ చెప్పులు తీసుకెళ్లమని కోరిన తిరస్కరించాలి. ఇంటికి వచ్చిన తరువాతనే చెప్పులు కొనాలి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన ఇంటి పరిసరాల్లో ఉండి, మరో ప్రాంతానికి వెళుతుంటారు. అటువంటి వారు ట్రాన్స్ పోర్ట్ కు ఇబ్బందవుతుందని వాళ్లకు అనుకూలంగా ఉన్నవారికి వాళ్ళు వాడిన ఫర్నిచర్ తీసుకోమంటారు. ఎంత మంచి వస్తువయినా సరే అసలే తీసుకోరాదు.

సాధారణంగా ఒకరి ఇంటికి, మరొకరు వెళుతుంటారు. ఒకరి ఇంటి నుంచి వచ్చేటప్పుడు మనం అధిక ఎండలో కానీ, వర్షంలో కానీ తిరిగి రావడం సహజం. ఆ సమయంలో గొడుగు తీసుకొని వెళ్ళమని వాళ్ళు వాడిన గొడుగు ఇస్తారు. ఎంత కష్టమైన సరే. మొహమాట పడకుండా వద్దని చెప్పేయండి.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});