Mudhiraj : ముదిరాజుల రాజకీయ వాటా కోసం నిరంతరం పోరాడుతాం
Mudhiraj : ముదిరాజుల రాజకీయ వాటా సాధించుకునే వరకు నిరంతరం శాంతియుత పోరాటాలు చేద్దామని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ బట్టు విట్టల్ స్పష్టం చేశారు. జిల్లాలోని నాగిరెడ్డి మండలంలోని వాడి గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ముదిరాజులు ఘనంగా పూజలు చేశారు. ఈ సందర్బంగ విట్టల్ మాట్లాడుతూ ....... ముదిరాజ్ సంస్కృతి, సాంప్రదాయాలు ఆచారాలు,అమ్మపెద్దమ్మ తల్లి ఆశీస్సులతోనే సృష్టించబడినాయన్నారు. పూర్తి నమ్మకంతో విశ్వాసంతో,నమ్మిన ప్రతీ ఒక్కరిని అమ్మవారు కాపాడుతారన్నారు. రాజకీయ హక్కుల కోసం మన ముదిరాజ్ కులం పోరాటాలు చేస్తుందన్నారు....